Saturday, September 4, 2010

ఏ మున్నది గర్వ కారణం... అంతా అవినీతి మయం... అలసత్వ నాయకత్వం



అసలు ఈ మధ్య ఏ విషయం గురించి వ్రాయాలని అలోచిన్చాలిసిన పని లేకుండా వుంది. ఎక్కడ చూసినా అవినీతి తారాస్థాయికి చేరి వుంది. ఎమ్మార్  మొదలుకొని విధ్యరుదుల స్కాలర్షిప్/ ఫీజులు , ప్రాజక్టులు.... ఎలా ఎక్కడ చూసినా వందల, వేల కోట్ల రూపాయలలో అవినీతి చెదలు ఆంధ్ర ప్రదేశ్ ని ఆవరించి వున్నాయి. మరో వైపు తెలంగా చిచ్చు క్రొత్త పుంతలు తొక్కుతుంటే, జగన్ రాజకీయం ఇంకో వైపు అధికార పార్టీని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి అన్నిటి మీదా అభిప్రాయాలు వ్రాస్తూ పొతే ఒక జీవితకాలం సరిపోదేమో!!.

ఇక కేంద్రం విషయానికి వస్తే... ముఖ్యంగా శరద్ పవార్, సురేష్ కల్మాడీ ల గురించి చెప్పుకోవాలి. కేంద్ర మంత్రి ఐ వుండి ఐ సి సి ఆధ్యక్ష పదవి వెలగబెడుతున్న శరద్ పవార్ అలసత్యం కారణంగా 4000000 టన్నులకు పైగా ఆహార ధాన్యాలు ఎందుకు పనిరకుండా పొఇ ఎఫ్ సి ఐ గోడౌన్ ల లో నుండి సముద్రంలో పదవేయవలసి వస్తుంది, ఒక లెక్క ప్రకారం ఈ విదంగా పనికి రాకుండా పొఇన ఆహార ధాన్యాల విలువ 55000  కోట్ల రూపాయలుగా తెలుస్తుది. వీటితో కోటి మందికి పైగా ప్రజలకు ఒక సంవత్సరం ఉచితంగా ఆహారం అందించవచ్చు అని ఒక అంచనా. శరద్ పవార్ క్రికెట్ ప్రేమ దేశానికీ శాపంలా పరిణమించింది. నా అభిప్రాయం ప్రకారం కేంద్ర / రాష్ట్ర మంత్రులను రాజకీయేతర భాద్యతలు తీసుకోవడం మీద నిషేధం విధించాలి.

ఇక కల్మాడీ విషయానికి వస్తే, కామన్వెల్త్ గేమ్స్ అయన చేతిలో పెట్టి భారత ప్రభుత్వం ప్రపంచదేశాల ముందు తల దిన్చుకోవలసిన పరిస్థితి. వందల కోట్ల రూపాయల అవినీతి అటువుంచి కానీసం స్టేడియం లు , సౌకర్యాలు ఐనా సమయానికి సిద్ధం చేస్తారా లేదా అన్నది ప్రస్నార్ధకమే.

No comments:

Post a Comment