Friday, April 8, 2011

Support Anna Haazare...​FIGHT AGAINST CORRUPT



అన్నా హజారే ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు
వేదికవద్దకు వచ్చిన చౌతాలా, ఉమా భారతి
వెనుకకు పంపించిన స్వచ్ఛంద కార్యకర్తలు
బిల్లుకోసం 42 ఏళ్ల నిరీక్షణ, 8 సార్లు విఫలయత్నం
అన్నా హజారే ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షకు ప్రజలనుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. దేశంలోని ఎన్నో ముఖ్యమైన నగరాలలో ప్రజలు స్వచ్ఛందంగా అన్నా హజారేకు మద్దతుగా ప్రదర్శన...లు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వచ్చిన రాజకీయనాయకులను హజారే మద్దతుదారులు వేదికపైకి రానివ్వడంలేదు. వచ్చినవారిని వచ్చినట్టు వెనుకకు తిప్పిపంపిస్తున్నారు.

బుధవారంనాడు ముందు ఓం ప్రకాశ్ చౌతాలా వచ్చి అన్నా హజారేకు మద్దతు ప్రకటిస్తానని చెప్పారు. అయితే మీ మద్దతు అక్కరలేదంటూ అన్నా మద్దతుదారులు ఆయనను వెనక్కి పంపించారు. ఆ తర్వాత ఉమా భారతి వచ్చారు. ఆమెను కూడా వెనక్కి పంపించారు. అయితే చౌతాలా లాగా ఆమె వెంటనే వెనుదిరగలేదు. నేను కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలకడానికే వచ్చానని ఆమె అక్కడున్నవారికి నచ్చజెప్పడానికి యత్నించారు.

ఇది రాజకీయేతర ఉద్యమం అని అన్నా హజారే అంటున్నారు. ఈ ఉద్యమం క్రమంగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు నిర్మిస్తున్న నిరసన ఉద్యమంగా రూపొందుతున్నది. జంతర్ మంతర్ బుధవారంనాడు జన లోక్‌పాల్ బిల్లు మద్దతుదారులతో కిక్కిరిసిపోయింది. ఈ బిల్లు కోసం 42 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఇప్పటికి ఎనిమిదిసార్లు ఈ బిల్లును ప్రవేశపెట్టారు, కాని ఏమి జరగలేదు, ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలని అన్నా హజారే ప్రశ్నించారు.

లోక్‌పాల్ బిల్లును వచ్చే లోక్ సభ సమావేశాలలోనే ఆమోదించగలమని న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ బుధవారంనాడు ఢిల్లీలో ప్రకటించారు. అయితే ఈ విషయంలో రాజకీయ నాయకులను నమ్మలేమని అన్నా హజారే చెప్పారు. జన్ లోక్‌పాల్ బిల్లు అవినీతిని దేశంలో నిర్మూలించడానికి ఉద్దేశించిందని, ఇది రాజకీయాలకు, హింసాకాండకు దూరంగా జరుగుతున్న ప్రజా ఉద్యమం అని, ఎవరు ఏమి చెప్పినా ఇక ఉద్యమాన్ని వదులుకునేది లేదని అన్నా హజారే ఉద్వేగంగా ప్రకటించారు.
See More

No comments:

Post a Comment