Saturday, August 28, 2010

ఒక్కసారైనా మీరు ఆలోచించారా...

అందరికి నమస్కారం,
నా పేరు సూర్య ......నేను ఒక వ్యక్తిగా  చేయలేనిది ఒక వ్యవస్థ గా  చేయచ్చు అని నాలో ఆలోచలన రేపిన సహచర కు నా కృతఙ్ఞతలు. వారు ఇచ్చిన దైర్యం తో ఈ బ్లాగ్ అవిస్కరించాను.
మన చిన్నతనం నుండి పుస్తకాల్లో ఇండియా అభిరుద్ది చెందుతున్న దేశం అని చదువుకున్నాం. కాని నిజానికి ఇండియా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి అబిరుద్ది చెంద్దుతూనే ఉంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా.... కనిసం మన తర్వాత తరమైన  ఇండియా అబిరుద్ది చెందిన దేశం గా పుస్తకాల్లో  చదువుతారనే నమ్మకం ఎవరికైన ఉందా. ఏ రోజైన మనం ఎందుకిల ఉన్నామో ఆలోచించారా? ఇండియా కి స్వతంత్రం వచ్చి 64 సంవత్సరాలల్లో జానాభ లో , పేద రికం లో , అవినీతి లో  ముందంచ లో ఉండడానికి ఆరాటపడుతుంది. కాని అబిరుద్ది  లో మాత్రం ఎప్పుడు వెనకంజే. తెల్ల వాళ్లకు బానిసలుగా ఉన్న మనకు  ఎన్నో యేళ్ళు ఎంతో మంది  మహానుబావుల ప్రాణత్యాగాలు ఫలితమే ఇప్పుడు మనకున్న ఈ స్వేచ్చ. కాని మనం ఈ 64 సంవత్సరాలల్లో అవినీతి కి బానిసలమయ్యం. పోలీసు అధికారులలో అవినీతి, పభుత్వ అధికారులలో అవినీతి, రాజకీయ నాయకుల్లో అవినీతి......ఇలా చెప్పుకుంటే పొతే అందరిలో అవినీతి నిండిపోయింది.వీటినన్ని ఎదిరించగల ఆయుధం  ప్రతి ఒక్క సామాన్యుడి చేతులో ఉంది అదే వోటు. ఆయిదేల్లకొక సారి వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరు మన వోటు హక్కును సక్క్రమంగా వినుయోగించుకుంటే అవినీతి నేతల తలరాతను , దేశ చరిత్రను మార్చ వచ్చు. కాని ఇక్కడ డబ్బున్న పెద్దవాళ్ళు అక్రమం గా సంపాదించినా డబ్బును ఏరా గా చూపి వోటు ను నోటు తో కొంటున్నారు...చట్ట సభ లో అడుగుపెడుతున్నారు. ఎప్పుడైతే సామాన్యుడు ప్రలోబాలకు లొంగి వోటు వేయకుండా ఉంటారో అప్పుడే సమాజం  లో మార్పు వస్తుంది. డబ్బున్న వాళ్ళు ఇంకా ఉన్న వాళ్ళు అవుతున్నారు, లేని వాడు ఇంకా లేని వాడు అవుతున్నాడు. ఇప్పటికైనా ఆలోచించండి అవినీతి ని , అవినీతి రాజకీయన్ని నిర్ములిద్దాం. నవ సమాజాన్ని నిర్మిద్దాం. రండి చేయి చేయి కలపండి...........

ఇట్లు మీ మిత్రుడు,
సూర్య.
(మీ సలహాలు సూచనల్ని దయచేసి బ్లాగ్ లో పొందుపరచండి).

6 comments:

  1. నోట్ తో వోట్ కొంటున్నారు వోట్ తో కోట్లు కూడా పెడుతున్నారు
    రెండు ఎకరాల తో రాజకీయం లో అడుగు పెట్టిన వాళ్ళు రెండు వేల కోట్లకు పడగ విప్పుతున్నారు ....
    కొంపలు అమ్ముకొని రాజకీయము లోకి వచినవాళ్లు కోటలకు అదిపతులు అవుతున్నారు
    వాళ్ళను ఏమి చెయ్య లేము ఎందుకంటే వాళ్ళను గుడ్డిగా నమ్మేజనం వర్గాలుగా కొమ్ముకస్తుంటాయి

    ReplyDelete
  2. బాధ్యత గల పౌరిడిగా మనం చేయాల్సిన పని అధికార మదం తో కళ్ళు ముసుకు పోయిన వాళ్ళకు కళ్ళు తెరిపించడం, కొమ్ములున్నాయని విర్ర వీగే వాళ్ళ కొమ్ములు విరచాలి.

    ReplyDelete
  3. You have a head for ideas – and you are good at improving systems. Logical and strategic, you prefer for everything in your life to be organized. you tend to only befriend those who are a lot like you.You would make an excellent Team leader, guider, or programmer.by kashi prasad

    ReplyDelete
  4. కాశి,మీ అమూల్యమైన సలహాలకు, సూచనలకు ముందుగా నా కృతఙ్ఞతలు....మీ సహకారం సదా ఉండాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  5. We will be favorable u alway.I request u to that will u plz send me some clues how to join blog n how operate this? what is this ?tell me a few words about it.

    ReplyDelete
  6. You are creative with a great imagination, living in your own inner world. [Definitely, but it has its drawbacks.] Open minded and accepting, you strive for harmony in your important relationships.[Very correct. I'm open to people and ideas (although I'm still critical).] It takes a long time for people to get to know you.You are hesitant to let people get close. But once you care for someone, you do everything you can to help them grow and develop. I've written this words for u I hope u accept it.

    ReplyDelete